అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
accident


అనంతపురం, 27 ఆగస్టు (హి.స.) రాయదుర్గం-అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(గురువారం) తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాఘవేంద్ర, నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande