రాయలసీమలోని రేణిగుంట రైల్వే స్టేషన్కు 166 ఏళ్ల చరిత్ర..
1862 ఆగస్టు 27న మొదటి పొగబండి రేణిగుంట నుంచి పట్టాలెక్కింది.
రాయలసీమలోని  రేణిగుంట  రైల్వే స్టేషన్కు 166 ఏళ్ల చరిత్ర..


రేణిగుంట, 27 ఆగస్టు (హి.స.) 1862లో రేణిగుంట చేరడంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది.చిన్న స్థాయి రైల్వే కేంద్రంగా ప్రారంభమైన రేణిగుంట నేడు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రైల్వే జంక్షన్లలో ఒకటిగా అభివృద్ధి చెందింది.తిరుపతి. తిరుమల పుణ్యక్షేత్రాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు రేణిగుంట జంక్షన్ కీలక రవాణా కేంద్రంగా సేవలందిస్తోంది.రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో ఈ ప్రాంతం వాణిజ్యపరంగానూ, రవాణా పరంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.రైల్వే అభివృద్ధిలో భాగంగా రేణిగుంట పరిధిలో అదనపు రైల్వే లైన్ల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి

రాయలసీమలోని రైల్వే స్టేషన్ ఏకంగా 166 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1860 ఆగస్టు 27న ప్రారంభమై.. ఇప్పుడు దక్షిణాదిలోనే ప్రధాన స్టేషన్గా.. రాష్ట్రంలోనే ముఖ్యమైన రైల్వే జంక్షన్గా మారింది. తిరుపతి జిల్లా రేణిగుండ రైల్వే జంక్షన్ 166 ఏళ్ల క్రితం చిన్న రేకుల షెడ్డులో 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. అలా ఈ జంక్షన్ అభివృద్ధి చెందుతూ ఉత్తరాదిని దక్షణాదితో అనుసంధానించే మార్గంలో కీలకంగా మారింది. ఇప్పుడు వందల మంది ఉద్యోగులతో.. వేలాదిమంది ప్రయాణికులతో ప్రతిరోజూ రద్దీ కనిపిస్తోంది. రైల్వే స్టేషన్ ఏర్పాటుతో చిన్న గ్రామంగా ఉన్న రేణిగుంట ఇప్పుడు పట్టణ స్థాయికి విస్తరించింది.

బ్రిటీష్ హయాంలో వ్యాపారం కోసం చెన్నై నుంచి ముంబైకి రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి రైల్వేట్రాక్ను 1859లో రేణిగుంట నుంచి పూడి వరకు 10 కిలోమీటర్ల మేర నిర్మించి జంక్షన్గా మార్చారు. 1859లో ఈ ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభించినా.. 1862 ఆగస్టు 27న మొదటి పొగబండి పట్టాలెక్కింది. రేణిగుంట నుంచి పాలు, సరకు రవాణా జరుగుతోంది.. కరోనా సమయంలో దేశ రాజధాని ఢిల్లీకి రేణిగుంట నుంచి పాల సరఫరా మొదలైంది.. ఇప్పటికి కొనసాగుతోంది. అంతేకాదు ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు యూరియా, రేషన్ బియ్యం కూడా ఇక్కడి యార్డుల నుంచే తరలిస్తారు. రైల్వే డివిజన్ పరిధిలోని రైలు పెట్టెలకు ఇక్కడే రిపేర్ చేసి పంపుతారు. అలాగే అమృత్ భారత్ పథకం కింద రేణిగుంట రైల్వే స్టేషన్కు కేంద్రం నిధులు కేటాయించింది.

రేణిగుంట రైల్వే స్టేషన్ తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు కూడా కీలకంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి రాకపోకలు కొనసాగించే చాలా రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. రేణిగుంట జంక్షన్ నుంచి ప్రధానంగా నాలుగు వైపులకు రైల్వే మార్గాలు (రూట్లు) ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande