
హిరమండలం, 31 ఆగస్టు (హి.స.)
హిరమండలం పరిధి చిన్నకోరాడకు చెందిన కొంకి గోవిందరావు(37)వంశధార కుడి ప్రధాన కాలువలో మునిగి మృతి చెందారు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో గ్రామం దగ్గరలోని కాలువలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఎక్కువగా ప్రవహించడంతో గాలింపునకు అవకాశం లేకుండా పోయింది. పోలీసులు వంశధార ఇంజినీర్లతో మాట్లాడి కాలువలో నీటి ప్రవాహం నిలుపుదల చేయించారు. అనంతరం స్థానిక యువత సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమీపంలోనే గోవిందరావు మృతదేహం లభ్యమైంది. శవపరీక్షకు పాతపట్నం సామాజిక ఆసుపత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ