ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు.. ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి ఫైర్
ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు.. ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి ఫైర్
MLA


హుజురాబాద్, 31 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘సమరభేరి' పేరుతో వారం రోజులపాటు విస్తృత నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

సోమవారం హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌశిక్డ్డి మాట్లాడారు. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. వెయ్యి రోజులైనా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు ఇలా ప్రతి వర్గాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande