భార్య మరణంతో కుంగిపోయి ఆత్మహత్య
భార్య మరణంతో కుంగిపోయి ఆత్మహత్య
suicide


పీఎంపాలెం, : , 31 ఆగస్టు (హి.స.)

భార్య మరణంతో మానసికంగా కుంగిపోయిన ఓ విశ్రాంత ఉద్యోగి చాకుతో తనకు తాను గాయాలు చేసుకుని, విద్యుత్తు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పీఎంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మురళీనగర్ ప్రాంతానికి చెందిన గంజా సూర్యనారాయణ(63) ఏఎస్ఐగా పని చేసి రిటైరయ్యారు. భార్య ఏడాది కిందట మృతి చెందారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత కొంత కాలంగా మధురవాడ పరిధి రేవళ్లపాలెంలోని ఓ అపార్టుమెంట్లో కుమార్తె వద్ద ఉంటున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వంట గదిలో చాకు తీసుకుని బయట ఉన్న కారిడార్కు వచ్చారు. చాకుతో మెడ, కుడి చేతి మణికట్టు, కడుపు భాగంలో కోసుకున్నారు. అనంతరం అక్కడ విద్యుత్తు మీటరు వద్ద ఉన్న తీగలను పట్టుకుని ప్రాణాలు విడిచారు. ఉదయం 6 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. సీసీ టీవీ ఫుటేజ్లో ఆయనేే స్వయంగా గాయాలు చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రావణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యనారాయణ ఆరిలోవ సీఐ మావగారని పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande