
ఆనందపురం:, 31 ఆగస్టు (హి.స.)
విశాఖ జిల్లా ఆనందపురం-అనకాపల్లి 16వ నంబరు జాతీయ రహదారిలోని ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. గండిగుండం పరిధి సత్తరువు కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని.. కారు బలంగా ఢీకొంది. దీంతో కారు ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో వాహనం దగ్ధమైంది. డ్రైవర్ బయటకు రాలేక కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారులో సజీవ దహనమైన వ్యక్తిని ఒడిశా గుణుపూర్కు చెందిన అమర్నాథ్ పాత్రోగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన ఆదివారం గుణుపూర్ నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా ఈ ప్రమాదం ఆనందపురం సీఐ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ