
హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే 8 లక్షల మంది విద్యార్థులు రాసిన లేఖలను సీఎంకు అందిస్తామని ఇందుకోసం సీఎం అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఏమాత్రం సానుకూలంగా లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు