
హనుమకొండ, 31 ఆగస్టు (హి.స.) హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని భూములు కొలతలు శాఖ కార్యాలయంలో భూముల రీ సర్వే వివరాలను సాఫ్ట్వేర్లో నమోదు చేస్తుండగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని భూములు కొలతలు శాఖ కార్యాలయంలో జిల్లాలోని గ్రామాలలో చేపట్టిన భూ రీ సర్వే వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భూముల రీ సర్వేను 5 దశల్లో చేపట్టిన వివరాలు భూములు, కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐ సారంగపాణి తెలిపారు.
రీసర్వేలో ముందుగా గ్రామ సరిహద్దు నిర్ధారణకు సర్వే, గ్రామకంఠం సరిహద్దుల సర్వే, ప్రభుత్వ కాలువలు రోడ్లు శిఖం భూముల సర్వే, ప్రభుత్వ ఆస్తులు, పాఠశాలలు, ఆసుపత్రులు, అసన్ చేసిన భూముల రీ సర్వే, పట్టాదారు భూముల రీ సర్వేను చేపట్టినట్లు కలెక్టర్కు వివరించారు. ఈ సర్వేకు సంబంధించి డేటాను సాఫ్ట్వేర్లో క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే వివరాలను, ల్యాండ్ పార్సల్ మ్యాప్స్(ఎల్పిఎం) సిద్ధం చేస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వే సమగ్ర వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా సర్వేయర్లు స్టాలిన్, విజయ్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..