కేసముద్రంలో రూ.1.90 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన మంత్రి పొంగులేటి
కేసముద్రంలో రూ.1.90 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన మంత్రి పొంగులేటి
Pongulati


మహబూబాబాద్, 31 ఆగస్టు (హి.స.)

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో రూ.1.90 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉపకేంద్రం ప్రాంగణంలో మంత్రులు మొక్క నాటారు. ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో కేసముద్రం మండల పరిధిలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande