మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై కీలక ఉత్తర్వులు
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై కీలక ఉత్తర్వులు
Musi river


హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగర వాసులకు నీటి కొరత తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఘన్పూర్ వరకు నీటిని తరలించేందుకు రెండు భారీ పైప్లాన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు పైప్లాన్లలో ఒక్కో పైప్లాన్ దాదాపు 10 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవనంలో ప్రాజెక్టులో భాగంగా మూసీ పునరుజ్జీవనంతోపాటు హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడానికి మల్లన్నసాగర్ నుంచి 20టీఎంసీల నీటిని గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2,3 దశల ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తూ జలమండలి గతంలోనే నోటిఫికేషన్ జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.5383.67కోట్లతో రెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని నోటిఫికేషన్లో జలమండలి పేర్కొన్నది. 2,3 దశలకు సంబంధించిన పైపులైన్ లను రెండు వరుసలుగా వేయనున్నారు. మొదటి ప్యాకేజీలో మల్లన్నసాగర్ నుంచి ఘన్ పూర్ వరకు, రెండో ప్యాకేజీలో ఘన్ పూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు పనులు చేపట్టనున్నారు. ఈ రెండు ప్యాకేజీల్లో పైపులైన్, పంపింగ్, నిర్మాణంతోపాటు టెస్టింగ్, కమిషనింగ్ వంటి కార్యక్రమాలను అన్నింటిని కలిపి ప్రాజెక్టు విలువ అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande