విముక్తి జాతుల అభివృద్ధికి కృషి చేయాలి: వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా
విముక్తి జాతుల అభివృద్ధికి కృషి చేయాలి: వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా
Collector


వరంగల్, 31 ఆగస్టు (హి.స.)

వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద హాజరై మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద అణచివేతకు గురైన సంచార, అర్ధసంచార జాతులకు విముక్తి కల్పించి డీ-నోటిఫైడ్ ట్రైబ్స్ గుర్తించిన సందర్భంగా ఏటా ఆగస్టు 31న విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande