బిహార్లో విషాదం.. నీటి గుంతల్లో పడి ఐదుగురు మృతి
బిహార్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Bihar rains


భాగల్పూర్, బీహార్, 11 సెప్టెంబర్ (హి.స.)

బిహార్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భాగల్పూర్ జిల్లాలోని కోయిలీ ఖుటాహా గ్రామంలో నీటితో నిండిన లోతైన గుంతల్లో పడి నలుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు.

గ్రామానికి సమీపంలోని పొలాలను చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు, గ్రామస్థులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా.. మరో చిన్నారి కూలీ కుటుంబానికి చెందినవాడని గ్రామ పంచాయతీ ముఖియా దేవేంద్ర కుమార్ తెలిపారు.

పొలాలకు వెళ్లే రహదారికి ఇరువైపులా లోతైన గుంతలు ఉండటంతో అవి వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయాడు.

అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన సమయంలో మిగిలిన వారు కూడా నీటిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఓ బాలిక ఒకే కుటుంబానికి చెందినవారని.. మరో చిన్నారి కార్మికుడి కుటుంబానికి చెందినవాడని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande