ఉపాధ్యాయుడు వేధింపులు వలన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
చెన్నైలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడు వేధింపులు వలన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Suicide


ఢిల్లీ , 11 సెప్టెంబర్ (హి.స.)చెన్నైలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడు వేధింపులు వలన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఒక స్కూల్కు చెందిన విద్యార్థి మనస్తాపంకి గురై బాలిక తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉపాధ్యాయుడు

ఆ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ను జగదేసన్గా గుర్తించి అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande