కాంగ్రెస్పై కాశ్మీర్ సీఎం ఆగ్రహం
జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది.
Kashmir CM


ఢిల్లీ , 11 సెప్టెంబర్ (హి.స.)జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా జాతీయ గీత జనగణమనతోపాటు జాతీయ గేయం వందేమాతరం కూడా ప్లే చేశారు. ఈ రెండూ ప్లే చేసేటప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎల్జీ, సీఎం, ఇతర నేతలు నిలబడి ఉన్నారు. అయితే, పూర్తి గేయం ప్లే చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించబోమని, రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ చెప్పింది. అయితే, సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం ఈ అంశంపై మాట్లాడారు. వందేమాతరం గేయం పాడాలంటూ చట్టం చేసేటప్పుడే పార్లమెంట్లోనే కాంగ్రెస్ అడ్డుకోవాల్సింది. ఇప్పుడు ఇది చట్టంగా మారింది. దీని ప్రకారం మొత్తం గేయం పాడాలి. అలా పాడకుంటే అది నేరమే. ఈ చట్టం దేశమంతా వర్తిస్తుంది. ప్రభుత్వాలు దీన్ని అమలు చేయకుండా తప్పించుకోకూడదు. తమ పార్టీ సిద్ధాంతాలకు, వందేమాతరం గేయానికి సంబంధం లేదన్నారు. ఇది చట్టం అని, అందువల్లే పాటిస్తున్నామన్నారు. కూటమిలో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తమపై ఒత్తిడి తేలేదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande