
ఢిల్లీ , 11 సెప్టెంబర్ (హి.స.)యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యలో బ్యాంకు ఉద్యోగుల నేడు సమ్మె కొనసాగింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. బ్రాంచ్ ఆపరేషన్స్, క్యాష్ డిపాజిట్స్, విత్రడాల్స్, చెక్కు క్లియరెన్సులు నిలిచిపోయాయి. ఉద్యోగులతో పాటు ఆఫీసర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. చాలా వరకు పబ్లిక్ రంగ బ్యాంకులను మూసివేశారు. యూఎఫ్బీయూ గ్రూపులో మొత్తం 9 ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఇక పబ్లిక్ రంగ బ్యాంకుల్లో సుమారు 8 లక్షల మంది వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
కోట్లాది మంది కస్టమర్లు ఇబ్బందిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్