ఢిల్లీలో 'బ్రిక్స్' సదస్సు ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రైలు సర్వీసుపై తీవ్ర ప్రభావం పడనుంది.
Bricks


న్యూఢిల్లీ, 11 సెప్టెంబర్ (హి.స.)

న్యూఢిల్లీ వేదికగా

జరుగుతున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రైలు సర్వీసుపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు అంటే మూడు రోజుల పాటు పలు లోకల్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని వేరే మార్గాలకు మళ్లించినట్లుగా ఇవాళ నార్తర్న్ రైల్వే ప్రకటించింది.

సదస్సు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, రద్దీని నియంత్రించే ఉద్దేశంతో అనేక ఈఎంయూ , మెము లోకల్ సర్వీసులను రద్దు చేశారు. అలాగే రాజధాని ఎక్స్ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్లతో సహా పలు కీలక లాంగ్-డిస్టెన్స్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడపనున్నారు. కొన్ని రైళ్లు తమ నిర్ణీత గమ్యస్థానాలకు బదులుగా ముందే ప్రయాణం ఫనీష్ చేయడం, వేరే స్టేషన్ల నుంచి బయలుదేరడం చేయనున్నాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande