
మహారాష్ట్ర, 11 సెప్టెంబర్ (హి.స.)
రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఆరుగురు
దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాందేడ్-భోకర్ (Nanded-Bhokar) రహదారిపై ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రయాణికుల వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆరుగు ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సీతాఖండి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
టాటా మ్యాజిక్ (Tata Magic) వ్యాన్ నాందేడ్ నుంచి భోకర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ నుజ్జునుజ్జయింది. దీంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనం నుంచి గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసు అధికారి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..