చిరుత పులి చర్మం తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న భద్రాద్రి పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని గన్నవరం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం మధ్యాహ్నం చిరుతపులి చర్మం తరలిస్తున్న వ్యక్తులను చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Police


భద్రాద్రి కొత్తగూడెం, 16 సెప్టెంబర్ (హి.స)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని గన్నవరం క్రాస్ రోడ్డు వద్ద చిరుతపులి చర్మం తరలిస్తున్న వ్యక్తులను చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వారిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెల్లడించారు. చిరుతపులి చర్మం తరలిస్తున్న ఆరుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మంతో పాటు గోర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పట్టుబడిన వారిలో చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన కోరం నారాయణ, కిష్టారంపాడు గ్రామానికి చెందిన పొడియం దేవేందర్, పొడియం సంతోష్, బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన అట్టం సాయి కిరణ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande