అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరం ఎమ్మెల్యే కూనమనేని
అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరం ఎమ్మెల్యే కూనమనేని
Mla


హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)

పెద్దల చేతుల్లోకి వెళ్లిన అసైన్డ్ భూములను గుర్తించి బయటకు తీయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నేడు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరమని అన్నారు.

కొంతమంది పెద్దలు ఎస్ఆర్ఎస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ భూములు ఎక్కడ ఉన్నాయి? ఎంత మేర చేతులు మారాయి? అనే విషయాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande