
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
మాజీమంత్రి హరీశ్ రావు భూ దోపిడీకి పాల్పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి.. తన మామ భూములను నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్బీసీ ఇచ్చిందన్న హరీశ్ రావ్యు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పే అవుతుందని ఆ సంగతి హరీశ్ రావుకు తెలియదా? మరి అలాంటప్పుడు హరీశ్రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. భూదాన్ భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నకిలీ ఎన్ఐసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అది కూడా తప్పేనని పొంగులేటి అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..