
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స.)
మా బాధ్యతను ఇంకెవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదని, 22ఏ అంశంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అని అసెంబ్లీ కంటే ముందే 22ఏ సమస్యపై ఫోకస్ పెట్టామన్నారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన సీఎం... మాపై వచ్చిన ఆరోపణల కారణంగా 22ఏ అశంపై చర్చ చేపట్టామన్నారు. ప్రధాన సమస్యలపై చర్చ నుంచి తప్పించుకునేందుకు విపక్షం ప్రయత్నించిందన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారన్నారన్నారు.గత బీఆర్ఎస్ హాయంలోని తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని, కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్రపూజల అంశం చర్చకు వస్తుందనీ బీఆర్ఎస్కు తెలుసని అందుకే ఎట్టి పరిస్థితుల్లో సభలో ఉండకూడదని వికృత చేష్టలు ప్రదర్శించారని సీఎం అన్నారు.
గత ప్రభుత్వ తప్పిదాలపై చర్చ జరగకూడదనేదే బీఆర్ఎస్ విధానం అని అసెంబ్లీ నిర్వహణపై గత ప్రభుత్వ రూల్స్ నే మేమూ పాటించామన్నారు. నినాదాలతో కూడిన డ్రస్సులు, ప్లకార్డులతో అసెంబ్లీకి రావొద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూల్స్ పెట్టారన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకే గేట్ నంబర్ 3 వద్ద అధికారులు అడ్డుకున్నారని అన్నారు. పార్లమెంట్ లో ఇలాంటి రూల్ ఉన్నా అక్కడ రాహుల్ ను అడ్డుకునేవారన్నారు. గత ప్రభుత్వం పెట్టిన అసెంబ్లీ రూల్స్ ను బీఆర్ఎస్ బ్రేక్ చేసిందని సభ బయట పోలీసులపై దాడి చేయడంతో పాటు సభాధ్యక్షుడిని అసభ్యకరంగా మాట్లాడారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు