
హైదరాబాద్, 16 సెప్టెంబర్ (హి.స)
నిషేధిత భూముల కు సంబంధించిన సెక్షన్ 22ఏ అంశంపై ప్రజల్లో అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని బిఆర్ఎస్ చూస్తోందని, ప్రభుత్వ విప్, నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుంటిసాకులు వెతుక్కున్నారని, శాసనసభాపతి తో పాటు పోలీసులను కూడా వారు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఒక 'జబర్దస్త్ కామెడీ షో'లా సాగిందని, అక్కడ కూడా 22A సమస్యపై చిత్తశుద్ధితో మాట్లాడలేకపోయారని వేముల ఎద్దేవా చేశారు. వారి పదేళ్ల పాలనలో 18 లక్షల ఎకరాల భూ సమస్యలను పరిష్కరించకుండా మరింత జటిలం చేసి, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆయన ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు