విద్యార్థుల మృతి పట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
మంత్రి పొన్నం ప్రభాకర్ నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతిచెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Minister ponnam


తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)మంత్రి పొన్నం ప్రభాకర్ , నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థుల మృతిచెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి పొన్నం తెలియజేశారు. నిమజ్జనాల ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. చెరువుల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. పిల్లలు, విద్యార్థులు నీటిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతైన ప్రాంతాలను గుర్తించి ప్రజలు అక్కడికి వెళ్లకుండా చూడాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande