మోదీ జన్మదినం సందర్భంగా కాశీలో 88 లక్షల దీపాలు..సీఎం చంద్రబాబు హాజరు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మోదీ జన్మదినం  సందర్భంగా కాశీలో 88 లక్షల దీపాలు..సీఎం చంద్రబాబు హాజరు


వారణాసి, 17 సెప్టెంబర్ (హి.స.)ఈరోజు (గురువారం) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వారణాసిలో నిర్వహించనున్న వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించనున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ఎక్స్ వేదికగా మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు.ఈ సందర్భంగా వారంతా ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించడం నుంచి ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించడం వరకు ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు.

ఈ ప్రత్యేక వేడుకను ‘ఆశీర్వాద్ నూ దివ్డో’ అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్లోని ప్రముఖ కంకరియా లేక్ఫ్రంట్ వద్ద 1.25 లక్షలు, అలాగే అటల్ బ్రిడ్జ్ ప్రాంతంలో 76 వేల దీపాలను వెలిగించి కాంతులీను ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘమైన 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande