
ఆంధ్రప్రదేశ్, 17 సెప్టెంబర్ (హి.స.) తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీనితో పాటుగా అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో వర్షాలు
ఇక ఈ ఆవర్తనం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతవారణ వాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మధ్యహ్నం వరకు కొద్దిపాటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఉండొచ్చని.. మధ్యాహ్నం తర్వాత, రాత్రి దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచానా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV