వాయుగుండం కారణంగా జిల్లాల్లో.బారీ వర్షాలు
ఎన్టీఆర్ జిల్లా, 24 సెప్టెంబర్ (హి.స.) వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం లేదా అవాంఛనీయ
rain


ఎన్టీఆర్ జిల్లా, 24 సెప్టెంబర్ (హి.స.)

వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు. విపత్తు వేళ కార్యాలయాలకే పరిమితం కాకుండా, అధికారులు నేరుగా రైన్‌కోట్లు ధరించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలిస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించాలని తేల్చి చెప్పారు.

ముఖ్యంగా తిరువూరు, జగ్గయ్యపేట అలాగే విజయవాడ పట్టణ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడైనా వరద నీరు ముంచెత్తే ప్రమాదం ఉంటే, ఆ ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అత్యవసర సేవలందించే శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande