రూ.22,177 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.
AP CM


అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.22,177.84 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 19,739 ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

ఇంధనం, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం వంటి పలు రంగాలు ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. గోవా షిప్యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాల భూమిని కేటాయించి సుమారు రూ.8,000 కోట్ల పెట్టుబడితో నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదించింది. సుమారు 1.7 కిలోమీటర్ల వాటర్ఫ్రంట్ ప్రాంతంలో ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రక్షణ, కోస్ట్గార్డ్ అవసరాల కోసం నౌకలతో పాటు వాణిజ్య, ఎగుమతి నౌకల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో 3,000 ప్రత్యక్ష, 5,000 పరోక్ష ఉద్యోగాలు కలిపి సుమారు 8,000 ఉద్యోగాల అవకాశాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంధన రంగంలో రూ.5,176.56 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 675 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. పరిశ్రమలు, వాణిజ్య రంగంలో రూ.4,332.49 కోట్ల పెట్టుబడులు, ఆహార ప్రాసెసింగ్ రంగంలో రూ.3,734.18 కోట్ల ప్రాజెక్టులకు అనుమతి లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande