అమరావతిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి పునాది.. ఏటా 3 లక్షల మందికి సేవలు
అమరావతిలో వైద్య, పరిశోధన రంగాలకు సంబంధించిన మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
L V prasad


అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)అమరావతిలో వైద్య, పరిశోధన రంగాలకు సంబంధించిన మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన ‘సుధా అండ్ వెంకట్ జాస్తి క్యాంపస్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ నిర్వహించారు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కొత్త క్యాంపస్లో ఏడాదికి మూడు లక్షల మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందించే సామర్థ్యం ఉండేలా ప్రణాళిక రూపొందించారు. సాధారణ కంటి వైద్య సేవలతో పాటు అధునాతన పరిశోధన, వైద్య నిపుణులకు శిక్షణ, కమ్యూనిటీ హెల్త్ కార్యక్రమాలు, డిజిటల్ హెల్త్ సేవలను అభివృద్ధి చేయనున్నారు.

ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 319 కేంద్రాల ద్వారా మూడు కోట్లకు పైగా రోగులకు సేవలు అందిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande