నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర పోలీసు పరిపాలనలో మార్పులకు దారితీసే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకుంది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
AP Police


అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర పోలీసు పరిపాలనలో మార్పులకు దారితీసే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకుంది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఈ కమిషనరేట్లకు IGP లేదా DIG స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరించే విధంగా వ్యవస్థను రూపొందించనున్నారు.

పట్టణీకరణ పెరుగుతున్న ప్రాంతాల్లో జనాభా, వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు పూర్తిగా కొత్త సిబ్బంది వ్యవస్థను సృష్టించకుండా, ఇప్పటికే ఉన్న పోలీసు బలగాలను పునర్విభజించి, అవసరాలకు అనుగుణంగా హోదాలు, బాధ్యతలను పునఃవ్యవస్థీకరించే విధానం ప్రతిపాదించారు.

గుంటూరు కమిషనరేట్ పరిధిలో గుంటూరు, గుంటూరు రూరల్, అమరావతి క్యాపిటల్ రీజియన్, తెనాలి జోన్లు ఉంటాయి

. తిరుపతి కమిషనరేట్లో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు కమిషనరేట్లో కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు సంబంధించిన విభాగాలు ఉంటాయి. రాజమహేంద్రవరం కమిషనరేట్కు మూడు భౌగోళిక జోన్లు ప్రతిపాదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande