డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ వ్యవహారం మరోసారి రాజకీయ, పరిపాలనా చర్చకు వచ్చింది.
Jagan


అమరావతి , 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ వ్యవహారం మరోసారి రాజకీయ, పరిపాలనా చర్చకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

జగన్ ఆరోపణ ప్రకారం డీఎస్సీ ప్రక్రియలో పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో లోపాలు, క్రీడా కోటా సర్టిఫికెట్లకు సంబంధించిన అనుమానాలు, కొన్ని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు వంటి అంశాలు ఉన్నాయని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

372 మంది అభ్యర్థులకు TET లేదా డీఎస్సీ పరీక్షలు రాయకుండానే అనుకూలంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులు తరువాత రద్దు చేశారని ఆయన ఆరోపించారు.

ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణలో ఒకే అధికారి కీలక బాధ్యతలు నిర్వహించడం కూడా వ్యవస్థాపరమైన సమస్యలకు దారితీసిందని జగన్ పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande