రోజురోజుకు తగ్గుతున్న శ్రీశైలం జలాశయం నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు ఉంది, తదిరత వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శ్రీశైలం


శ్రీశైలం, 30 సెప్టెంబర్ (హి.స.)శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం ఎన్ని టీఎంసీల నీరు ఉంది, తదిరత వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం లేకపోవడంతోపాటు ప్రతిరోజు వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. ఇలాగే కొనసాగితే మరో నెల రోజుల్లో నీటిమట్టం 830 అడుగులకు తగ్గుతుందని, నీటినిల్వలు క్రస్ట్గేట్ల దిగువకు చేరుకుంటాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఎగువ ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ద్వారా నీరు విడుదల కాకపోగా, తెలంగాణలో జెన్కో విద్యుదుత్పత్తి చేసేందుకు 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని సాగర్కు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న మంగళవారం సాయంత్రానికి ఆవిరి రూపంలో మరో 158 క్యూసెక్కుల నీరు పోయినట్టు నమోదైంది.

రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 850 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 89.29 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande