కొండా సురేఖ మాజీ ఓఎల్డీ కేసులో కీలక మలుపు
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎల్డీ (OSD) వ్యవహారానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Osd


హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.)

మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ

ఓఎల్డీ (OSD) వ్యవహారానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులు మహేందర్, అరుణ్, కార్తీక్లను పోలీసులు అధికారికంగా తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో నిందితులకు నాలుగు రోజుల కస్టడీ విధించడంతో, దర్యాప్తు బృందాలు వారిని రహస్య ప్రాంతంలో ముమ్మరంగా ప్రశ్నిస్తున్నాయి.

హత్యాయత్నం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద నమోదైన అభియోగాలపై అధికారులు వారి నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి, ఘటనకు ముందు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఓఎస్ఓ సుమంత్తో నిందితులకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నేరం జరిగిన తీరు, దానికి సమకూర్చిన వనరులపై నిందితుల నుంచి పూర్తి సమాచారం రాబడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande