
నెల్లూరు, 05 సెప్టెంబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిసింది. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నట్లు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. పూర్వపు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు యోగి స్వర్ణభారత్ ట్రస్టుకు విచ్చేస్తున్నట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ఇటీవల మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ యూపీ సీఎం యోగిని కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ట్రస్ట్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ