జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం ఇద్దరు మహిళ ల మృతి
జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళ ల మృతి చెందారు
accident


ఒంగోలు, 05 సెప్టెంబర్ (హి.స.)

ప్రకాశం జిల్లా ఒంగోలులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ మరమ్మతులకు గురవడంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. శనివారం తెల్లవారు జామున అదే మార్గంలో వేగంగా దూసుకొచ్చిన మినీ లారీ వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఒంగోలు తాలూకా సీఐ విజయ్కృష్ణ మృతదేహాలను జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. మృతులు పల్నాడు జిల్లా అమరావతి మండలం జీలుగు గ్రామానికి చెందిన చలంచర్ల తిరుపతమ్మ(27), బాపట్ల వెంకటేశ్వరమ్మ(24)గా గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande