
అమరావతి, 05 సెప్టెంబర్ (హి.స.)
సర్వేపల్లి ): ఓ ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం పొదలకూరు - నెల్లూరు ప్రధాన రహదారిపై న్యూ మంజుల బేకరీ సమీపంలో జరిగింది. ఆమంచర్ల నుంచి బైక్పై ఇద్దరు వ్యక్తులు పొదలకూరు వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్నట్రాక్టర్ ఢీకొంది. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ