
అన్నమయ్య జిల్లా, 05 సెప్టెంబర్ (హి.స.)రాజనాల బండ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పలమనేరు శాసనసభ్యులు నూతనకాల్వ అమర్నాథరెడ్డి దంపతులు పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి దంపతులకు రాజనాలబండలో ఘన స్వాగతం - శ్రీ వీరాంజనేయ స్వామి తిరుణాళ్ళ ఉట్లోత్సవం ఘనంగా ప్రారంభం అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయితీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ తిరుణాళ్ళ ఉట్లోత్సవాలు ఈ రోజు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ తిరుణాళ్ళ ఉట్లోత్సవ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి తో కలిసి శనివారం హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామస్తులు మరియు అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా పూర్ణకుంబ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం ఆలయ అర్చకులతో పాటు గ్రూప్ టెంపుల్ ఈవో రమణా రెడ్డి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రమేష్ రెడ్డి @ చిట్టి తదితరులున్నారు.
ఉదయం 6-00 గంటల నుండి కొండపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, రాజనాలబండ వద్ద శ్రీ వీరాంజనేయస్వామి వారికి ఉదయం 6-30 గంటల నుండి అభిషేకాలు జరిగాయి. సాయంత్రం 7-00 గంటలకు కొండపైన అఖండ జ్యోతి వెలిగింపు, రాత్రి 8-00 గంటల నుండి రాజనాల బండపై అఖండ జ్యోతుల వెలిగింపు, రాత్రి 9-00 గంటల నుండి ఆర్.బి. యూత్ ఆధ్వర్యంలో స్వామివార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర కళానాట్యమండలి వారిచే భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించారు. కొండపైన వెంగళపల్లి యూత్ ఆధ్వర్యంలో మరియు రాజనాలబండపై జి.ఆర్.ఎస్. రమణ లచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV