ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజుల పెంపును వెంటనే రద్దు చేయాలి....వినోద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో MBBS, BDS ఫీజులను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని PDSU నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ డిమాండ్ చేశారు.
pdsu-demands-rollback-of-mbbs-and-bds-fee-hike-in-ap-18145


అనంతపురం, 05 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో MBBS, BDS ఫీజులను పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని PDSU నియోజకవర్గ కార్యదర్శి వి.వినోద్ డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో PDSU ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.వినోద్ మాట్లాడుతూ ఇప్పటికే వైద్య విద్య అత్యంత ఖరీదైన విద్యగా మారిందని, మరోసారి ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు.

2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో UG కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. MBBS Management Quota ఫీజు రూ. 13.20 లక్షల నుంచి రూ. 14.52 లక్షలకు, NRI Quota ఫీజు రూ. 39.60 లక్షల నుంచి రూ. 43.56 లక్షలకు, BDS Management Quota ఫీజు రూ. 4.40 లక్షల నుంచి రూ. 4.84 లక్షలకు, NRI Quota ఫీజు రూ. 13.20 లక్షల నుంచి రూ. 14.52 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు.

ఇది కేవలం ఫీజుల పెంపు కాదని, డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది విద్యార్థుల కుటుంబాలపై అదనపు భారాన్ని మోపే నిర్ణయమని విమర్శించారు. NEET కోచింగ్, అప్లికేషన్ ఫీజులు, హాస్టల్, పుస్తకాల ఖర్చులతో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయని, ఫీజుల పెంపుతో వైద్య విద్య సామాన్యులకు మరింత దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande