తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈ రోజు రేపు శిక్షణ తరగతులు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
AP Govt


అమరావతి, 07 సెప్టెంబర్ (హి.స.) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఈరోజు (సోమవారం), రేపు (మంగళవారం) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్షాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుప్రారంభించారు.

ముందుగా దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కాంక్లేవ్కు చంద్రబాబు, లోకేశ్, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు, పార్లమెంట్ పరిశీలకులు హాజరయ్యారు. టీడీపీ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబుపై వచ్చిన వాటర్మన్ ఆర్టికల్పై టీడీపీ నేతలు చర్చించారు. ఒకప్పుడు సీఈఓగా పేరు తెచ్చుకున్న సీఎం.. ఇప్పుడు వాటర్మన్గా అభివర్ణిస్తూ జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసక్తిగా చదివారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగునీటి ప్రాజెక్టులు, నీటి భద్రత, నీటి సంరక్షణ వంటి అంశాలను మంత్రులు గుర్తు చేసుకున్నారు. నీటి సరఫరాను అందించి కియా వంటి పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి వచ్చేలా చంద్రబాబు చేశారంటూ ప్రజాప్రతినిధులు కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande