
తెలంగాణ , 07 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీచేసింది.
మేడ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో పేర్కొన్నది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్