
తిరుమల, 07 సెప్టెంబర్ (హి.స.) తిరుమల శ్రీవారి దర్శనార్థానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారాయి. దీంతో భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, సేవకులు నిరంతరం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఒక్కరోజే మొత్తం 87,115 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
35,053 మంది భక్తులు కళ్యాణకట్టలలో తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు మరోవైపు కొండపైకి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. దర్శన క్యూలైన్లు, ప్రాంగణాల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది నిరంతరం రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV