మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు
దిల్లీ:అక్టోబర్ 24 (హింస)దేశ ప్రజలకు బూస్టర్ డోసులు ఇవ్వడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకా రెండు
మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు


దిల్లీ:అక్టోబర్ 24 (హింస)దేశ ప్రజలకు బూస్టర్ డోసులు ఇవ్వడంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ మూడో మోతాదు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతుండగా.. బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. కాగా మూడో డోసు వినియోగంపై దిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్దీప్ గులేరియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande