ఆంధ్రప్రదేశ్లోని వెల్దుర్తి స్టేషన్ నుండి మొదటిసారిగా కాస్టిక్ సోడా లోడిరగ్
దక్షిణ మధ్య రైల్వే తన సరుకు రవాణా రంగంలో కొత్త సరుకులను జోడిరచడం ద్వారా సరుకు రవాణాను మరింత పెంచడంప
ఆంధ్రప్రదేశ్లోని వెల్దుర్తి స్టేషన్ నుండి మొదటిసారిగా కాస్టిక్ సోడా లోడిరగ్


దక్షిణ మధ్య రైల్వే తన సరుకు రవాణా రంగంలో కొత్త సరుకులను జోడిరచడం ద్వారా సరుకు రవాణాను మరింత పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ, మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి స్టేషన్ నుండి సాధారణంగా ‘‘కాస్టిక్ సోడా లై’’గా పిలవబడే సోడియం హైడ్రాక్సైడ్ (నూతన సరుకు) లోడిరగ్ ప్రారంభించింది. 80 కంటైనర్లలో దాదాపు 2,200 టన్నుల కాస్టిక్ సోడా వెల్దుర్తి నుండి ఒరిస్సా రాష్ట్రంలోని డమాన్జోడి వద్ద నాల్కో సైడిరగ్ వరకు 40 బిఎల్ఎల్ వాగన్లలో నేడు అనగా 23 అక్టోబర్ 2021 తేదీన లోడ్ జరుగుతోంది.

వెల్దుర్తి స్టేషన్ నుండి 50 కిమీ దూరంలో ఉండే కర్నూల్ సమీపంలోని తాండ్రపాడు గ్రామం వద్ద కాస్టిక్ సోడా ప్రధానంగా ఉత్పత్తి చేయబడుతుంది. దీనిని సబ్బులు, రేయాన్, కాగితం, పేలుడు పదార్థాలు, రంగులు మరియు పెట్రోలియం ఉత్పత్తులను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా కాటన్ బట్టలు, లాండ్రిరగ్ మరియు బ్లీచింగ్, మెటల్ వస్తువులను శుభ్రపరచడంలో, ఆక్సైడ్ కోటింగ్, ఎలక్ట్రోప్లేటింగ్ మరియు ఎలక్ట్రోలిక్ ఎక్సాట్రింగ్లో కూడా వినియోగిస్తారు. ఈ సరుకును సాధారణంగా రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసేవారు.

హైదరాబాద్ డివిజన్ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ వారు సురక్షితంగా, సజావుగా, ఆర్థిక ప్రయోజకరంగా మరియు ఎటువంటి నష్టాలు లేకుండా రైల్వే ద్వారా సరుకు రవాణా చేయవచ్చనే ప్రయోజనకరమైన అంశాలను సరుకు రవాణా వినియోగదారులకు తెలియజేసి వారిని రైల్వే ద్వారా సరుకు రవాణాకు ఒప్పించగలిగారు. ఇది సుదూర ప్రాంతాల రవాణాకు ఎంతో ప్రయోజనకరమైనది. దీంతో, సరుకు రవాణా వినియోగదారులు వెల్దుర్తి స్టేషన్ నుండి ట్యాంక్ కంటైనర్లలో కాస్టిక్ సోడా సరుకును లోడ్ చేయడానికి ముందుకొచ్చారు. దీనిద్వారా జోన్ నుండి కాస్టిక్ సోడా మొదటి రేక్ రవాణా చేయడానికి అవకాశం కలిగింది.

జోన్ పరిధిలో సరుకు రవాణా రంగంలో మరో నూతన సరుకు జోడిరచిన హైదరాబాద్ డివిజన్లోని అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ మరియు డివిజినల్ బీడీయూలు ఇదే కృషిని నిరంతరం కొనసాగిస్తూ జోన్ పరిధిలో సరుకు రవాణా అభివృద్ధిని కొనసాగించాలని ఆయన ఆదేశించారు. రైల్వే ద్వారా సరుకు రవాణా రైల్వే వారిలోపాటు వినియోగదారులకు కూడా పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande