ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న స్థాయిలో నమోదు కాలే్దు
ముంబయి, 23 నవంబర్ (హిం.స): దేశంలో ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, వార్షిక ప్రాతి
ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న స్థాయిలో నమోదు కాలే్దు


ముంబయి, 23 నవంబర్ (హిం.స): దేశంలో ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, వార్షిక ప్రాతిపదికన 1-4 శాతం తగ్గొచ్చని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాహన ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరడమే కారణమని పేర్కొంది. ఏప్రిల్-అక్టోబరు మధ్య దేశీయ విపణిలో 80.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయని, 2020 ఇదే సమయంతో పోలిస్తే పెద్దగా మార్పు లేదని తెలిపింది. ద్విచక్ర వాహన కొనుగోలుకు రుణాలు ఇచ్చే ఫైనాన్షియర్లు ఆచితూచి వ్యవహరించడంతో పండుగ సీజన్లో విక్రయాలు అనుకున్న స్థాయిలో నమోదు కాలేదని వివరించింది. ప్రీమియం ద్విచక్ర వాహనాలకు గిరాకీ బాగానే ఉన్నా సెమీ కండక్టర్ చిప్ల కొరతతో కంపెనీలు సరఫరా చేయలేకపోయాయని తెలిపింది

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande