జాతీయ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవాలి... జిల్లా జడ్జి శ్రీనివాసరావు
తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స)ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్ అదాలతో సివిల్ కేసులు రాజీపడదగిన క
జాతీయ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవాలి... జిల్లా జడ్జి శ్రీనివాసరావు


తెలంగాణ: ఖమ్మం: ఫిబ్రవరి 4 (హిం.స)ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్ అదాలతో సివిల్ కేసులు రాజీపడదగిన క్రిమినల్ కేసులు తదితరాలతో పాటు వినియోగదారుల ఫోరంకు సంబంధించిన కేసులను కూడా పరిష్కరించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు ఆయన శనివారం కమిషన్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి లోక్ అదాలత్ తీరు తెన్నులను ఉపయోగాలను సభ్యులకు వివరించారు.

కమీషన్ తీర్పుల వల్ల కొన్ని సందర్భాలలో కక్షిదారులు అప్పీల్ కి వెళ్లే అవకాశం ఉంటుందని దీనివల్ల సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉంటుందని కానీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైతే అది అంతిమ తీర్పు అని న్యాయమూర్తి వివరించారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార


 rajesh pande