కర్ణాటక, 1 అక్టోబర్ (హి.స.)
మహిళను వేధించిన కేసులో 'ఓలా'కు భారీ షాక్ తగిలింది. ఓలా సంస్థకు రూ.5 లక్షల భారీ జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2018 ఆగస్టులో ఓ మహిళ ఓలా రైడ్ను బుక్ చేసుకుంది. ఈ క్రమంలోనే క్యాబ్ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆ మహిళ ఆరోపిస్తూ కేసు పెట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం, పిటిషనర్కు అదనంగా రూ.50 వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..