అమెరికా నుంచి భారత్ చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.) భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఈ రాకతో భారత సైన్యం ఆర్డర్ చేసిన మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్ల సరఫరా పూర్తయ
అపాచీ హెలికాప్టర్లు


ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.)

భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఈ రాకతో భారత సైన్యం ఆర్డర్ చేసిన మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్ల సరఫరా పూర్తయినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నాటికే రావాల్సిన ఈ హెలికాప్టర్ల సరఫరా పలుమార్లు జాప్యం చెందింది. ఈ మైలురాయిని ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి సంయుక్త ప్రకటనలో చేసుకున్న రక్షణ ఒప్పందాల అమలులో భాగంగా ఒక కీలక అడుగుగా అమెరికా ఎంబసీ పేర్కొంది.

తాజాగా వచ్చిన మూడు హెలికాప్టర్లతో కలిపి మొత్తం ఆరు అపాచీలను రాజస్థాన్లోని జోధ్పూర్ కేంద్రంగా మోహరించనున్నట్లు సైన్యం తెలిపింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande