నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత
ముంబై: /ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.)ఈక్విటీ మార్కెట్‌ వరుస నష్టాల నుంచి బయటపడలేకపోతోంది. నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి
Bombay Stock Exchange


ముంబై: /ఢిల్లీ 17,డిసెంబర్ (హి.స.)ఈక్విటీ మార్కెట్‌ వరుస నష్టాల నుంచి బయటపడలేకపోతోంది. నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఒక దశలో 592.75 పాయింట్లు నష్టపోయి 84,620.61 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరికి ఆ నష్టాన్ని 533.50 పాయింట్లకు పరిమితం చేసుకుని 84,679.86 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 167.20 పాయింట్ల నష్టంతో 25,860.10 వద్ద క్లోజైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande