
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం ఇథియోపియాలో అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం రాత్రి ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ ఇచ్చిన వింధులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇథియోపియా సింగర్స్ భారత దేశ జాతీయ గేయమైన వందేమాతరాన్ని పాడారు. దీంతో జాతీయ గేయం 150ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇలా ఆలపించడం తనను కదిలించింది అని ప్రధాని ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేశారు.
మరోవైపు ఇథియోపియా పార్లమెంటునులోనూ మోడీ ప్రసంగించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇథియోపియా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించడం తనకు చాలా గౌరవంగా అనిపించిందన్నారు. ఇథియోపియా యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి గౌరవాన్ని తెచ్చిపెడతాయని పేర్కొన్నారు. విలువలు, పరస్పర విశ్వాసం మరియు శాంతి, అభివృద్ధి మరియు సహకారం కోసం ఉమ్మడి దృక్పథంతో మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను తెలియజేస్తున్నానని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..