ఖమ్మం, 1 అక్టోబర్ (హి.స.)
ఖమ్మం జిల్లాలొ సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. సీఎంఆర్ ధాన్యం వ్యవహారంలో అవకతవకలు చేసిన మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ ను భట్టి ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో వంద కోట్ల మేరకు సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రభుత్వ, ప్రజల ఆస్తి అని గుర్తు చేశారు. సీఎంఆర్ అవకతవకలకు ఎవ్వరు పాల్పడినా సహించేది లేదన్నారు. అక్రమాలకు కారకులైన వారు ఎంతటి వారు అయినా కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధ్యులైన మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి ఆదేశించారు. బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ.. మిల్లులకు తరలింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..