
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడిన ఆమె అన్ని ఆలోచించే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని దయచేసి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తాసుఖేందను మరోసారి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు బీఆర్ఎస్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అనేక ఆంక్షల మధ్య పని చేయాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్లో ప్రశ్నిస్తున్న తనను అణగదొక్కారని తన రాజకీయ ప్రస్తానాన్ని వివరిస్తూ నిండు సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏ నాడు నాకు మద్దతుగా నిలవలేదని, బీఆర్ఎస్ చానల్, పేపర్ ఏనాడు నాకు సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, ఏనాడు టికెట్ కోసం అడుక్కోలేదన్నారు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పని చేశానన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు